ఫోన్ ట్యాపింగ్ విషయంలో జగన్ పై దేవినేని ఉమా ఘాటు విమర్శలు

52చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ విషయంలో జగన్ పై దేవినేని ఉమా ఘాటు విమర్శలు
నారా లోకేష్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో టీడీపీ నేత దేవినేని ఉమా స్పందించారు. సీఎం జగన్ కు చేసిన దోపిడీ విషయమై భయం పట్టుకుందని అందుకే ప్రజల వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూస్తున్నారని విమర్శించారు. ఇదంతా జగన్ ఆదేశంతో డీజీపీ ఆధ్వర్యంలో జరుగుతోందని ఉమా ఆరోపించారు. నారా లోకేష్ యాపిల్ ఐఫోన్ కు ట్యాపింగ్ చేస్తున్నట్టు అలెర్ట్ రావడంతో ఈసీకి కనకమేడల రవీంద్ర ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్