రేగిడి మండలం బూరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ వై చలమయ్య ఆధ్వర్యంలో నులిపురుగుల నివారణకు గోడ పత్రికను ఆవిష్కరించారు. ఫిబ్రవరి 9 నుంచి అంగన్వాడి, పాఠశాల, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఒక సంవత్సరం నుంచి 2 ఏళ్ల లోపు అరమాత్ర, 3 నుంచి 19 ఏళ్ల వరకు ఒక మాత్ర వాడాలన్నారు. నులిపురుగులు పిల్లల్లో పౌష్టికాహారం లోపం ఉన్నవారికి, శారీరక, మానసిక ఎదుగుదల లేకపోవడానికి కారణమన్నారు.