రాజాం నియోజకవర్గం గత పదేళ్లుగా అభివృద్ధికి వెనుకంజలో ఉందని, జగన్ ఇచ్చిన హామీలన్నీ మోసపురితమైనవని ప్రజలు గ్రహించి, వైకాపా ప్రభుత్వం ఈ అయిదేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ నిరీయమయ్యాయి విశ్రాంతి ఆర్డీవో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పీఎంజే బాబు అన్నారు.మంగళవారం ఉంగరాడ మెట్ట వద్ద సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. జగన్ పాలనలో అభివృద్ధి శూన్యమని,ఆంధ్ర రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా చేశారని విమర్శించారు.