ఉంగరాడమెట్ట డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎస్సై ఈ. శ్రీనివాసరావు యాంటీ డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. విద్యార్థులు, యువత మత్తు మందుకు దూరంగా ఉండాలని తెలిపారు. డ్రగ్స్ వాడితే భవిష్యత్తు నాశనం అవుతుందని వెల్లడించారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అవలంబించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైతో పాటు ప్రిన్సిపాల్ బుచ్చిరాజు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.