గరివిడి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బి. లోకేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. కాగా ఈయన బుదరాయవలస ఎస్ ఐ గా పనిచేస్తూ ఇక్కడకు బదిలీపై వచ్చారు. గరివిడి లో ఎస్సైగా విధులు నిర్వహించిన ఎల్ దామోదరరావు చీపురుపల్లి కి బదిలీపై వెళ్లారు. గరివిడి పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అలాగే ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకోకుండా కృషి చేస్తానని ఎస్సై లోకేశ్వరరావు గురువారం తెలిపారు.