విజయవాడ: విజన్ 2047లో కౌలు రైతుల ప్రస్తావన ఎక్కడ..?
విజన్ 2047 డాక్యుమెంట్లో సాగులో 80% ఉన్న కౌలురైతుల ప్రస్తావన ఎక్కడ.? అంటూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్రప్రధాన కార్యదర్శి జమలయ్య ప్రశ్నించారు. శనివారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విజన్ 2047 డాక్యుమెంట్ పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు, వ్యాపార సంపన్న వర్గాలకు ఉపయోగపడే పద్ధతుల్లో ఉందన్నారు.