విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీఎన్ భట్టి శనివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ ఉప కార్యనిర్వాహణధికారి రత్నరాజు వారికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు.