విజయవాడ: మత్స్యకారులకు అన్ని విధాల చేయూతను అందిస్తాం
మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధి అవకాశాల కోసం సుస్థిరమైన మత్స్య రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్య శాఖల మంత్రి కె. అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకలు-2024 సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.