ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో పట్టపగలే చీకటి కమ్ముకుంది. ఉన్నట్టుండి వాతావరణంలో మార్పులు సంభవించడంతో ఉదయం 11 గంటల నుండి చల్లటి గాలి వీచి, ఒక్కసారిగా మబ్బులు కమయ్యాయి. దీంతో సాయంత్రం 6 గంటల సమయంలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చీకటి అలుముకుంది. తుఫాను ప్రభావం వలన వాతావరణంలో మార్పులు సంభవించినట్లు ప్రజల అభిప్రాయపడుతున్నారు.