బొబ్బిలి కమిషనర్ ఎల్. రామలక్ష్మి క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా మంగళవారం ఇందిరమ్మ కాలనీ, నాయుడు కాలనీ ఏరియాలలో పర్యటించారు. ఇందిరమ్మ కాలనీలో కాలువలు, రోడ్లను పరిశీలించి కాలువలలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించాలని సిబ్బందికి సూచించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా కాలనీల్లో వ్యాధులు ప్రబలకుండా ఉండేలా సిబ్బంది చర్యలు చేపట్టాలని సూచించారు.