బొబ్బిలి మండలం బూర్జవలసలో తమ గ్రామానికి సమీపంలోని బెర్రీ కంపెనీ బోరు 10 హెచ్ పి మోటర్ సహాయంతో 24గంటలు భూగర్భ జలాన్ని తోడేస్తున్నారని సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి గేదెల అప్పలనాయుడు అన్నారు. ఈ చర్యల వల్ల భూగర్భ జలాలు అడగంటి గ్రామనికి నీరు రావడంలేదని అన్నారు. తక్షణమే అధికారులు జోక్యం చేసుకొని ఎటువంటి అనుమతులు లేకుండా భూగర్భ జలాలను తోడేస్తున్న బెర్రీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.