కొత్తపల్లిలో వైద్య శిబిరం

475చూసినవారు
కొత్తపల్లిలో వైద్య శిబిరం
గరుగుబిల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో 104 వైద్య శిబిరం నిర్వహించారు. ఈ గ్రామంలో ప్రతి నెల మూడవ సోమవారం 104 మెడికల్ క్యాంపు ఉంటుందని డాక్టర్ కౌశిక్ చెప్పారు. బీపీ, షుగర్, ఆస్మా, థైరాయిడ్, రోగులకు టెస్టులు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అలాగే గర్భిణీలకు గుండె సంబంధిత రొగులకు ఈసీజీ లు తీయడం జరిగింది. అలానే వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గ్రామ ప్రజలకు వివరించారు. ఈ 104 వైద్య సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 104 వెహికల్ లో దాదాపు 80 రకాల మందులను ఎల్లప్పుడూ ఉంటాయని రోగులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కౌశిక్ డిఈఓ ప్రశాంత్, పైలెట్ ఈశ్వరరావు, ఏ ఎన్ ఎం లక్ష్మి, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్