బొబ్బిలి: ట్రాక్టర్ లో తెస్తున్న గడ్డివాముకు నిప్పంటుకొని దగ్ధం
బొబ్బిలి మున్సిపాలిటీ పరిధి గొల్లపల్లి నుండి బొబ్బరి లక్ష్మికి చెందిన ఎండు గడ్డి లోడు శుక్రవారం ట్రాక్టర్ తో కోరాడ వీధి మీదగా తీసుకొస్తుండగా మసీదు దగ్గరలో పిల్లలు మంట కాగుతుండగా నిప్పులు గడ్డికి అంటుకున్నాయి. వెంటనే ట్రాక్టర్ డ్రైవర్ కృష్ణ మరియు నారాయణ కోరాడ వీధి శివారు కళ్ళములో గడ్డిని అన్లోడ్ చేసి ట్రాక్టర్ ను వేరు చేశారు. ఎలాంటి ప్రయాణం నష్టం జరగలేదు.