సీతానగరం మండల తహాశీల్దారుగా కె. ప్రసన్న కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆ స్థానంలో ఉన్న తహసీల్దారుగా పనిచేసిన జె. రాములమ్మ రిలీవ్అయి ఆయనకు బాధ్యతలు అప్పగించారు. రాములమ్మకు వేపాడ బదిలీ అయిన సంగతి తెలిసిందే. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రసన్నకుమార్ విజయనగరం జిల్లా నుండి ఇక్కడకు విచ్చేశారు. ఆయనను ఉపతహాశీల్దార్ ఉమామహేశ్వరరావు, రెవిన్యూ సిబ్బంది, గ్రామ రెవెన్యూ అధికారులు అభినందించారు.