అక్రమ వ్యాపారాలు,రవాణా పై ప్రత్యేక నిఘా: సీఐ

54చూసినవారు
అక్రమ వ్యాపారాలు,రవాణా పై ప్రత్యేక నిఘా: సీఐ
అక్రమ వ్యాపారాలు, రవాణా వంటి కార్యకలాపాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు శనివారం తెలిపారు. రామభద్రపురం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ప్రసాద్ తో కలిసి ఆయన మాట్లాడుతూ. మద్యం, నాటుసారా నిల్వలు, బహిరంగ మద్యపానం వంటి చర్యలు చట్ట వ్యతిరేకమన్నారు. బహిరంగంగా మద్యం సేవించి గొడవలు తెచ్చే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రజలంతా పోలీసు చట్టాలకు లోబడి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్