చీపురుపల్లి మండలం లో ఉన్న విజ్ఞాన్ పాఠశాలలో "మన ఆరోగ్యం మన చేతిలో"కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపాల్ పతివాడ జ్యోతి మాట్లాడుతూ కంటి చూపుకు అవసరమైన వివిధ రకాల విటమిన్ ల గురించి వివరించారు. వీటిలో బొప్పాయి తినడం వలన రక్తం లో ప్లేట్ లైట్ ల శాతం పెరుగుతుందని క్యారెట్ తినడం వలన కంటి చూపు మెరుగవుతుందని రక్త హీనత ను నివారిస్తుందని విద్యార్థులకి వివరించారు.