చీపురుపల్లి: మంచినీటి బోరును ప్రారంభించిన ఎంపీపీ

52చూసినవారు
చీపురుపల్లి: మంచినీటి బోరును ప్రారంభించిన ఎంపీపీ
చీపురుపల్లి మండలం జి అగ్రహారంలో నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి బోరు ను ఆదివారం ఎంపీపీ ఇప్పిలి అనంత ప్రారంభించారు. మండలంలోని ఆయా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మండల పరిషత్ నిధులు రూ. 1. 20 లక్షలతో నూతనంగా మంచినీటి బోరు ను ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పిటిసి వల్లిరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్