చీపురుపల్లి పట్టణంలోని ఆంజనేయపురం మెయిన్ రోడ్డు అనుకొని ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ షాప్ పెట్టుకొని దివ్యాంగుడు శ్రీనివాసరావు జీవనం సాగిస్తున్నారు. అయితే గురువారం రాత్రి షాపులో మంటలు వ్యాపించడంతో సుమారు రూ. 40లక్షల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న చీపురుపల్లి
వైసీపీ నాయకుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు కాలిపోయిన షాప్ ను శుక్రవారం పరిశీలించి, అన్నివిధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.