విజయనగరం జిల్లా మెరకముడిదాంమండలంలో గల శివారు గ్రామమైన గరుగుబిల్లిలో గురువారం విద్యుత్ ఘాతానికి రైతు ఆవాల వెంకటరమణ (46) బలైన సంఘటన చోటు చేసుకుంది. బుదరాయవలస పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు గరుగుబిల్లి గ్రామానికి చెందిన రైతు తన పొలంలో గల మోటారు స్విచ్ ఆన్ చేసేందుకు వెల్లి షార్ట్ సర్క్యూట్ అయి షాక్ తగిలి అక్కడికి అక్కడే మృతి చెందాడు. ఎస్సై నవీన్ పడాల్ శవ పంచనామ నిర్వహించి పోష్ట్ మార్టం నిమిత్తం మృత దేహాన్ని చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.