రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా టిడిపి అధ్యక్షులు చీపురుపల్లి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ కిమిడి నాగార్జున ఆద్వర్యంలో.. మండల టిడిపి అధ్యక్షులు తాడ్డి సన్యాసి నాయుడు అధ్యక్షతన గాదిల మర్రివలస పంచాయతీ లో బాధుడే- బాదుడు కార్యక్రమం జరిగింది. జగన్మోహన్ రెడ్డి సి. యం. అయిన తరువాత నిత్యవసర సరుకులు ధరలు పెంచారని దీనివల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబాలు నిత్యవసర సరుకులను కొనలెక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టిడిపి నేతలు అన్నారు. గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి నాయకులు వివరించారు. ప్రజల్లో స్పందన కనిపించింది. ఈ కార్యక్రమంలో గాదిల మర్రివలస పంచాయతీ టీడీపీ నాయకులు చల్ల శ్రీరామ్, రామచంద్రడు, శ్రీను, పైడితల్లి , నారాయణమరియు టీడీపీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.