ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను పరిశీలించిన మండల నాయకులు

62చూసినవారు
ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను పరిశీలించిన మండల నాయకులు
గురువారం చీపురుపల్లి పట్టణం రెల్లివీధి పోలీస్ స్టేషన్ ఎదురుగా సుమారు రూ. 10 లక్షలతో చేపట్టిన నూతన ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని ఎంపీపీ ప్రతినిధి ఇప్పిలి అనంతం, జడ్పీటీసీ ప్రతినిధి వల్లిరెడ్డి శ్రీనివాసరావు, మేజర్ పంచాయతీ సర్పంచ్ మంగళగిరి సుధారాణి పర్యవేక్షించారు. పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు. స్థానిక సర్పంచ్ మాట్లాడుతూ నీటి సదుపాయం కల్పించి, మిగిలిన పనులకు నిధులు మంజూరు చేయాలని ఎంపీపీ, జడ్పీటీసీలను కోరింది.

సంబంధిత పోస్ట్