విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గోపన్నవలసలో ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్యామలి పిజిషియన్ పథకాన్ని ఎంపిపి తాడ్డి కృష్ణవేణి, మండల వైకాపా అధ్యక్షులు తాడ్డి వేణుగోపాల రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాటాడుతూ ప్రతి సచివాలయం లో నెలకొక రోజు ఆప్ సేవలు ఉంటాయని వాటిని ఆయా సచివాలయ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నెలలో ఒకరోజు ప్రతి సచివాలయంలో ఉదయం 9 నుండి ఆప్ సేవలు ఆ గ్రామములో అందుబాటులో వుంటాయని, ఇక్కడ అన్నిరకాల వ్యాధులకు రక్త పరీక్షలు చేసి మందులు ఇవ్వటం అవుతుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మెరకముడిదాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సాంబమూర్తి, డైరెక్టర్ కృష్ణ మూర్తి రాజు, ఎంపీటీసీ సీతారామ రాజు పలువురు నేతలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.