చీపురుపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాతీయ గణిత దినోత్సవం నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ డా. ఎల్ విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జాతీయ గణిత దినోత్సవంను డిసెంబర్ 22న దేశవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారని గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారని తెలిపారు.