చీపురుపల్లి మండలంలో ఉన్న విజ్ఞాన్ పాఠశాల
విద్యార్థులు"మీకోసం మేము"ప్రోగ్రాంలో భాగంగా రావివలసలో ఉన్న బాపూజీ వృద్ధాశ్రమాన్ని ఎల్ కే జి
విద్యార్థులు శనివారం సందర్శించారు. దీనిని ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి మాట్లాడుతూ..
విద్యార్థులు అందరు పెద్దల పట్ల ప్రేమ, ఆప్యాయత, వాత్సల్యం కలిగి ఉండాలని వృద్ధాప్యంలో తల్లి దండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని వారికి ఎటువంటి హాని తలపెట్టకూడదని ఆవిడ తెలిపారు.