గంట్యాడ మండలంలోని నరవ గ్రామం పంచాయతీ లో ఎ. ఎం. జి కాలనీలో 104 ద్వారా మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ హేమలత, 30 మంది రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. అవసరమైన రోగుల ఇళ్ల వద్దకు వెళ్లి వైద్యసేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎం ఎల్ హెచ్ పి లావణ్య, ఎ ఎన్ ఎమ్, ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.