గంట్యాడ మండలం నరవ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని.. గంట్యాడ ఎంపీపీ పిరిబండి హైమవతి, జెడ్పిటిసి వర్రి నరసింహ మూర్తి, నరవ గ్రామ సర్పంచ్ పతివాడ భాస్కరరావు కోరారు . మంగళవారం గంట్యాడ మండలంలోని నరవ గ్రామంలో గల రైతు భరోసా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ హైమవతి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతన్నల అభివృద్ధి కోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు . రైతులు దళారీల బారిన పడకుండా ఉండేందుకు ఈ కొనుగోలు కేంద్రాలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి వర్రి నరసింహ మూర్తి, వైసీపీ నాయకులు మోపాడ రాజు ఎంపీటీసీ, సుంకరి రామక్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.