'ఎన్నటికీ మారని నాలాల పరిస్థితి'

7319చూసినవారు
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం నరవ గ్రామంలో నాలాల సమస్య ఏళ్లు గడుస్తున్నా తీరడం లేదు. ప్రతి వర్షాకాలంలో వరద ముంపు సంభవించినప్పుడు సమస్య గురించి చర్చిస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం లభించడం లేదు. వర్షం వస్తే అనేక ప్రాంతాల్లో ముంపు సమస్యకు గురవుతోంది. నాలాల గుండా వెళ్లాల్సిన వరద నీరు. రోడ్లపైకి చేరుతోంది. నాలాల్లో వేస్తున్న వివిధ రకాల వ్యర్థాలు ఇందుకు ఒక కారణం కాగా.. భారీ వర్షాలొస్తే తట్టుకునే సామర్ధ్యం నాలాలకు లేదు. ఇక గంటకు 2 సెం. మీ. ల కంటే ఎక్కువ వర్షం కురిసినా మునిగే ప్రాంతాలెన్నో ఉన్నాయి. ప్రధాన ర హదారుల వెంబడి వరదకాలువల్లో సాఫీగా నీరు వెళ్లేలా చేయాలనీ స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూడికతీతలు తీయాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్