గంట్యాడ మండలం నరవ గ్రామములో టిడిపి ఎపిటిసి అభ్యర్థి కాళ్ళ సత్తిబాబు, కాళ్ళు క్రిష్ణ మాజీ ఎపిటిసి దాదాపు ముప్పై కుటుంబాలు గంట్యాడ మండలం ప్రెసిడెంట్ వర్రి నరసింహమూర్తి, నరవ గ్రామ సర్పంచ్ అభ్యర్థి పతివాడ భాస్కరరావు అధ్వర్యంలో గజపతినగరం శాసనసభ్యులు బొత్స అప్పలనర్సయ్య సమక్షంలో కండువ వేసి పార్టీలోనికి ఆహ్వానించారు. వై.యస్. జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పధకాలు ఆకర్షతులయి పార్టీ లో చేరమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మోపాడ రాజు, సుంకరి రామక్రిష్ణ, పిల్లా వినోద్, కాళ్ళా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.