దత్తిరాజేరు మండలంలో గల కోరప కృష్ణా పురం గ్రామం లో ఉన్న రైతు భరోసా కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారిని ఎం. అనురాధ సోమవారం తనిఖీ చేశారు. ఆమె కియోస్కోమిషన్ ఉపయోగాలు ను గ్రామ సచివాలయ వ్యవసాయ అధికారి రామలింగేశ్వర రావు కు వివరిస్తూ రైతులకు ఎరువులు పురుగు మందులు విత్తనాలను ఇండెంట్ పెట్టుకోవాలని సూచించారు. అదేవిధంగా రైతులకు ఈ కేవైసీ, ఈ క్రాఫ్ నమోదు ను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.