దత్తిరాజేరు మండలం ఎస్ బూర్జి వలసలో సర్పంచ్ పొట్నూరు రమణ మనవడు జన్మదిన సందర్భంగా.. దేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు కర్ణం శివరామకృష్ణ చేతులమీదుగా గ్రామంలో వృద్ధులకు 150 దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలకు తెలిపారు. పొట్నూరు రమణ లాంటి మంచి వ్యక్తిని ఈ గ్రామంలో ప్రజలు చేసుకున్న అదృష్టమని ఆయన కొనియాడారు. గతంలో రమణ 25 సంవత్సరాల నుంచి సర్పంచ్ గా పని చేసి ప్రజలకు ఎంతో సేవ చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి తప్ప గంగమ్మ మండల టిడిపి అధ్యక్షులు సభ చంద్రశేఖర్, కార్యదర్శి మిత్రుడు ఈశ్వరరావు, మరిపల్లి సర్పంచ్ సత్యనారాయణ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.