ఉచిత రేషన్ ఎగ్గొట్టోద్దు -పేదల కడుపు కొట్టోద్దు

572చూసినవారు
ఉచిత రేషన్ ఎగ్గొట్టోద్దు -పేదల కడుపు కొట్టోద్దు
గంట్యాడ మండలం ఎమ్మార్వో ఆఫీస్ వద్ద గురువారం మండల టిడిపి అధ్యక్షులు కొండపల్లి భాస్కర్ నాయుడు ఆధ్వర్యంలో ఉచిత రేషన్ ఎగ్గొట్టొద్దు పేదల కడుపు కొట్టవద్దు అనే నినాదంతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ నాయుడు మాట్లాడుతూ ఆహార భద్రత చట్టాన్ని రాజ్యాంగం సిద్ధించిన హక్కు అని దీన్ని వైసీపీ ప్రభుత్వం అతిక్రమిస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఈ వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్