గజపతినగరంలోని బి ఎస్ ఆర్ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు డాక్టర్ సతీష్ రెడ్డి సెట్టి, డాక్టర్ ప్రవర్ధన్ లు 60 మంది రోగులను పరీక్షించి ఆరుగురు రోగులను శస్త్ర చికిత్సకు ఎంపిక చేశారు. లయన్ బెల్లాన లక్ష్మి నరేన్ మాట్లాడుతూ తమ ఆసుపత్రికి చెవి, ముక్కు సంబంధించి ఆరోగ్యశ్రీ మంజూరైనట్లు చెప్పారు.