విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మధుపాడ, కాలం రాజుపేట, పాత శ్రీరంగరాజపురం గ్రామాల సర్పంచులు డిమాండ్ చేశారు. ఆదివారం గజపతినగరంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బెల్లాన జ్ఞాన దీపిక అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఎంపీపీ మాట్లాడుతూ సమస్యలను సంబంధిత అధికారులు పరిష్కరించాలని సూచించారు. జడ్పిటిసి గార తౌడు, ఎంపీడీవో కళ్యాణి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.