వైయస్సార్ ప్రభుత్వం చేపడుతున్న గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య గురువారం మరడాం గ్రామం లో పర్యటించారు. గ్రామంలో ఇంటికి ఇంటికి వెళ్లి అమ్మ ఒడి చేయూత మీకు అందాయా లేదా అనిఅడిగితెలుసుకున్నారు. జగనన్న ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా నేరుగా ప్రజలకు అందే విధంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. అర్హులైన వారు ఎవరైనా ఉంటే వారిని గుర్తించి పథకాలు చేరవేసే విధంగా అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పొరలి కోపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సుమల శ్రీనివాసరావు మండల ఎంపిపి గేదెల సింహాద్రి నాయుడు సుమల గోవిందా బమ్మిడి అప్పలనాయుడు మండలంఅధికారులు గ్రామ సర్పంచి శంకర్రావు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు మండల అధికారులు సచివాలయం సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.