విజయనగరం జిల్లా బొండపల్లిలో నిర్వహిస్తున్న ఆధార్ అప్డేట్ కేంద్రాన్ని సోమవారం ఎంపీడీవో జి. గిరిబాల ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రానికి వచ్చే వారికి సకాలంలో సేవలు అందేలా చూడాలని సూచించారు. ఆధార్ నమోదు చేసుకుని పది సంవత్సరాలు దాటిన వారు ఆధార్ అప్డేట్ చేసుకోవాలన్నారు. ఈ తనిఖీల్లో ఈవోపీఆర్డి రఘుపతిరావు పాల్గొన్నారు.