గజపతినగరం: నలుగురు దుకాణదారులకు నోటీసులు

85చూసినవారు
గజపతినగరం: నలుగురు దుకాణదారులకు నోటీసులు
గజపతినగరంలోని ముగ్గురు టిఫిన్ దుకాణదారులతో పాటు ఒక చికెన్ సెంటర్ యజమానికి నోటీసులు జారీ చేస్తున్నట్లు గజపతినగరం ఎంపీడీవో బి. కళ్యాణి తెలిపారు. బుధవారం గజపతినగరంలోని పలు వీధుల్లో గల పారిశుధ్యం పరిశీలించడంతో పాటు దుకాణాల పరిశుభ్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిశుభ్రత పాటించని వారికి నోటీసులు జారీ చేస్తున్నామని చెప్పారు. కుళాయిల వద్ద అపరసభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్