దత్తరాజేరు స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య ఆధ్వర్యంలో శనివారం కే కృష్ణాపురం సచివాలయం వద్ద జగనన్న సురక్ష అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ముందుగా ఎమ్మెల్యే సచివాలయం సిబ్బందితో సంక్షేమ పథకాలు రిజిస్టర్లు తనిఖీ చేసి పథకాలు అందరికి అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ జగనన్న ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్ని 98% ప్రజలకు అందజేచేశామని చెప్పారు.ఇంకా అర్హులు ఎవరైనా ఉంటే వారిని వారికి కూడా మా సిబ్బంది ద్వారా మా వాలంటీర్ ద్వారా పథకాలు అన్ని విధంగా కృషి చేయాలని తెలియపరిచారు.రాబోయే ఎన్నికల్లో
జగన్ చేసే మంచి పనులకు అనుగుణంగా మళ్ళీ జగన్ని ముఖ్యమంత్రి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సింహాద్రి అప్పలనాయుడు, జడ్పిటిసి ప్రభుత్వ రాజేశ్వరి,పిఎసి చైర్మన్ శ్రీనివాసరావు,సర్పంచ్ కరిదుర్గమ్మ,సచివాలయం సిబ్బంది,వాలంటీర్లు ప్రజలు పాల్గొన్నారు.