మరుపల్లి: వైభవంగా మజ్జి గౌరమ్మ పండగ

67చూసినవారు
మరుపల్లి: వైభవంగా మజ్జి గౌరమ్మ పండగ
విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని మరుపల్లి గ్రామంలో మజ్జి గౌరమ్మ పండగ ఆదివారం వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ గావించారు.

సంబంధిత పోస్ట్