గంట్యాడ మండలం నరవ గ్రామంలో ఇటీవల అకాల మరణం చెందిన నల్లి చిట్టిబాబు అనే యువకుడి కుటుంబానికి నరవ యువత రూ.47,000ల నగదు, రైస్ ప్యాకెట్ ను ఆర్థిక సహాయంగా అందించారు. నరవ యువత యొక్క సేవాతత్పరతకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తామని నరవ యువత ఆశాభావం వ్యక్తం చేసింది.