స్కార్పియో ఢీకొని వృద్ధుని మృతి

76చూసినవారు
స్కార్పియో ఢీకొని వృద్ధుని మృతి
బొండపల్లి మండలంలోని అంబటి వలస సంతోషిమాత గుడి సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం స్కార్పియో ఢీకొని అదే గ్రామానికి చెందిన నెమ్మాది అప్పలనాయుడు(60) అక్కడికక్కడే మృతి చెందినట్లు మొబైల్ హెచ్ సి నాయుడు తెలిపారు. రాయగడ నుంచి విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి రోగిని తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్