బొండపల్లి పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం సందర్శించారు. రికార్డులను తనిఖీ చేసి కేసులు పురోగతిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మహిళా పోలీసులు తదితర సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో జరుగుతున్న నేరాలు, శాంతి భద్రతల సమస్యలు, బెల్ట్ షాపులు, గంజాయి విక్రయ వినియోగదారులు సమాచారాన్ని సంబంధిత పోలీసు అధికారులకు తెలియజేయాలని, సైబర్ మోసాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.