Oct 28, 2024, 16:10 IST/
సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రతలో మార్పులు
Oct 28, 2024, 16:10 IST
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రతలో మార్పులు జరిగాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం ఇంటి వద్ద భద్రతలో భాగంగా ఉన్న బెటాలియన్ పోలీస్ సిబ్బందిని సీఎం సెక్యూరిటీ వింగ్ తొలగించింది. వారి స్థానంలో ఆర్మ్డ్ రిజర్వ్(ఏఆర్) సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేశారు. ఇంటికి మూడు వైపులా ఉన్న 22 మంది టీజీఎస్పీ సిబ్బందిని మార్చి ఏఆర్ సిబ్బందితో భద్రత నిర్వహిస్తున్నారు.