తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలు

50చూసినవారు
తీవ్ర అల్పపీడనం.. భారీ వర్షాలు
AP: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడనుంది. అది తీవ్ర అల్పపీడనంగా బలపడనుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో మంగళవారం నుంచి గురువారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ, రేపు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధ, గురు వారాల్లో సముద్రంలో అలజడిగా మారుతుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్