తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో భాగమైన 6 గ్యారంటీలపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. 'విత్తు నాటగానే ఫలాలు రావు.. ఫలాలు రావాలంటే కొంత సమయం పడుతుంది. అలాగే హమీల అమలుకు కొంత సమయం పడుతుంది. ఇప్పటికే ఆరు గ్యారెంటిల్లో నాలుగింటిని అమలు చేస్తున్నాం. మిగిలిన రెండు గ్యారెంటీలను త్వరలో ప్రారంభిస్తాము' అని చెప్పారు.