కురుపాం నియోజకవర్గం జియమ్మవలస మండలం రావాడ రామభద్రపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న నిమ్మక సంజీవరావు ఆకస్మికంగా మృతి చెందిన సంగతి విదితమే. ఆ కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయంగా ఒక లక్ష రూపాయల చెక్కును పార్వతీపురం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి అశుతోష్ శ్రీవాస్తవ విద్యార్థి తండ్రి నిమ్మక కృష్ణారావుకు గురువారం ఆయన ఛాంబరులో అందజేశారు.