ప్రకృతి సాగులో విత్తన గుళికల తయారీ విధానం

649చూసినవారు
ప్రకృతి సాగులో విత్తన గుళికల తయారీ విధానం
పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం దుగ్గేరు యూనిట్ పనసభద్ర, అలుగురువు, జగ్గుదొర వలస గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో రైతులతో విత్తన గుళికల తయారీ విధానంపై అవగాహన నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయ సీఆర్పీ ఉర్లక నాగార్జున మాట్లాడుతూ.. విత్తన గుళికలు తయారు చేయడం వల్ల అకాల వర్షాలు పడడం, కొన్ని సందర్భాల్లో భూమి అదును ఇవ్వకపోవడం వంటి పరిస్థితులలో పొడి భూములలో ఈ విత్తన వేయడం వల్ల విత్తనాలు పాడవ్వకుండా, పక్షులు, కీటకాలు తినకుండా ఉండి, వర్షాలు పడేటప్పుడు మొలకెత్తుతాయి అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్