ఎంపిటిసికి రాజీనామా చేసిన ఎమ్మెల్యే

56చూసినవారు
ఎంపిటిసికి రాజీనామా చేసిన ఎమ్మెల్యే
కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఎంపీటీసీ పదవికి గురువారం రాజీనామా చేశారు. గతంలో ఆమె గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్ పేట ఎంపీటీసీగా పోటీ చేసి గెలిచారు. అనంతరం ఆమె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కురుపాం నుంచి బరిలో నిలిచి మాజీ మంత్రి పుష్పశ్రీవాణిపై విజయం సాధించారు. దీంతో ఎంపీటీసీ పదవికి రాజీనామా చేయగా జడ్పీ సీఈవో ఆమోదించారు.