గుమ్మలక్ష్మీపురంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

64చూసినవారు
గుమ్మలక్ష్మీపురంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు
గుమ్మలక్ష్మీపురం మండలంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టామని జిల్లా పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ గురువారం తెలిపారు. మండలంలోని తాడికొండ, మండ, వనకాబడి, బాలేసు, కుక్కి, గుమ్మలక్ష్మీపురం, కేదారిపురం, ఆర్కే జమ్మూ గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి క్లోరినేషన్ కార్యక్రమం చేపట్టమన్నారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టమని ఆయన తెలిపారు.