మైనర్ విద్యార్థులపై స్వతంత్ర అభ్యర్థి దాడి..

4911చూసినవారు
సంతకవిటి మండలం డోలపేటవద్ద రాజాం నియోజకవర్గం ఇండిపెండెంట్‌ అభ్యర్థి ఎన్ని రాజు, అతని అనుచరులు పెనుబాక గ్రామానికి చెందిన 7, 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు పై దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. శనివారం అభ్యర్థి కార్యాలయానికి ముందు ఒక కారు ఉండడంతో ఆ కారు వద్ద వారిద్దరూ నిల్చొని మాట్లాడుకుంటున్నారు. వీరిని దొంగతనం చేసిన వారిగా అనుమానించి కార్యాలయంలోనికి తీసుకువెళ్లి తలుపులు వేసి తీవ్రంగా కొట్టారు.