విశాఖ డైరీ బోర్డు డైరెక్టర్ గా గుర్ల మాజీ ఎంపీపీ, రాష్ట్ర టిడిపి బీసీ సెల్ కార్యదర్శి వి సన్యాసి నాయుడు ఎన్నికయ్యారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈయన విశాఖ డైరీ స్థానిక సొసైటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పాడి రైతుల సంక్షేమానికి, అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన సోమవారం తెలిపారు. ఈయన ఎన్నిక పట్ల మండలంలో పలువురు పాడి రైతులు తమ హర్షం వ్యక్తం చేస్తున్నారు.